రేపే 'గాయపడ్డ సింహం' ప్రీమియర్లు... ఎల్లుండి రిలీజ్
- తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో 'గాయపడ్డ సింహం' చిత్రం
- మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
- ఒక రోజు ముందే ఏప్రిల్ 30న ప్రీమియర్ షోలు
- కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన 'గాయపడ్డ సింహం' (GPS) చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
అయితే, అసలు విడుదలకి ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ ఎత్తున ప్రీమియర్లు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ఒక మంచి వినోదాత్మక ప్రయాణం మీ కోసం వేచి ఉంది' అంటూ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. పవన్ సాధినేని సమర్పణలో భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.