లండన్‌ ప్రేమ కథతో ఆనంద్‌ దేవరకొండ ‘ఎపిక్‌’.. టీజర్‌ వచ్చేసింది

Anand Devarakonda Epic movie teaser out now
  • ‘బేబీ’ హిట్ జోడీ మళ్లీ మ్యాజిక్
  • ఆదిత్య హాసన్ మార్క్ కామెడీ
  • యూకే నేపథ్యంలో సాగే ప్రేమకథ
  • ఆకట్టుకుంటున్న సినిమా టీజర్
బేబీ’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య  జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’. ‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆదిత్య హాసన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీజర్ బుధవారం విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘#90s’ సిరీస్‌లో మెప్పించిన ఆదిత్య పాత్ర చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆ యువకుడు ఇంటి సభ్యుల ఒత్తిడితో పైచదువుల కోసం యూకే వెళతాడు. అక్కడ వైష్ణవీ చైతన్యతో ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేది ఈ టీజర్‌లో చూపించారు. ఆనంద్ దేవరకొండ తన సహజ సిద్ధమైన నటనతో మధ్యతరగతి యువకుడిగా ఒదిగిపోయారు.

పక్కా లోకల్ అబ్బాయి ఫారిన్ వెళితే పడే ఇబ్బందులను కామెడీగా చూపిస్తూనే, మరోవైపు ఎమోషనల్ లవ్ ట్రాక్‌ను కూడా ఆదిత్య హాసన్ టచ్ చేసినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. యూకే నేపథ్యంలోని విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఆనంద్, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ మరోసారి వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ఫస్ట్ సెమిస్టర్ అని టైటిల్‌లో ఉండటంతో ఇది యూత్, స్టూడెంట్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది.
Advertisement
Anand Devarakonda
Epic
Teaser
Vaishnavi Chaitanya
Adithya Hasan
Tollywood

More Telugu News