సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన టాలీవుడ్ హీరోలు
టాలీవుడ్ హీరోలు తమ అభిమానులకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ హీరోలు వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్ లు తన అభిమానులకు భోగి, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఓ ట్వీట్ లో శుభాకాంక్షలు చెప్పారు. ‘మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు’ అని జూనియర్ ఎన్టీఆర్, ‘హ్యాపీ భోగి’ అని వెంకటేశ్ తమ ట్వీట్లలో తెలిపారు.