'సంక్రాంతి విన్నర్ అల వైకుంఠపురములో..' అంటూ చిత్ర యూనిట్ పోస్టర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సంక్రాంతి విన్నర్ అల వైకుంఠపురములో..' అంటూ చిత్ర యూనిట్ పోస్టర్!

  • వినూత్న ప్రచారం మొదలు
  • సరికొత్త పోస్టర్ విడుదల
  • తొలి రోజు రూ. 30 కోట్ల షేర్ వసూలు
నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో..'పై చిత్ర యూనిట్ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాల్లో విన్నర్ తమ చిత్రమేనంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ఇక సినిమా తొలి రోజు కలెక్షన్లను పరిశీలిస్తే, రూ. 30 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక గణాంకాలు విడుదల కానప్పటికీ, నైజాంలో రూ. 5 కోట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌ లో రూ. 2.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2 కోట్లు, గుంటూరులో రూ. 3 కోట్లు, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో సుమారు రూ. 3 కోట్లు కలిపి, మొత్తం మీద ఏపీ, టీఎస్ లో ఫస్ట్ డే రూ. 20 కోట్లు వసూలు అయినట్టు సమాచారం. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు రూ.3.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Ala Vaikunthapuramulo
Allu Arjun
Movie
Sankranti

More Telugu News