వెనక్కి తగ్గని పృథ్వీ... మరోసారి అవే వ్యాఖ్యలు చేసిన ఎస్వీబీసీ చైర్మన్!
- ఆందోళన చేస్తున్నవారిలో పెయిడ్ ఆర్టిస్టులున్నారని పునరుద్ఘాటన
- కటౌట్లు తగలబెట్టినా పట్టించుకోనని వెల్లడి
- విమర్శలు చేసేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడితే స్పందించబోనని, తన కటౌట్లు తగలబెట్టినా పట్టించుకోనని తెలిపారు. తాను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగానే మాట్లాడానని అన్నారు. అమరావతిలో బినామీ రైతుల పేరుతో టీడీపీ నేతలు భూములు కొన్నారన్నది వాస్తవం అని ఆరోపించారు. తానేమీ రైతుల మనోభావాలు దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. విమర్శలు చేసేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.