జగన్ కు చెవి మిషన్, కళ్లజోడును పంపి, నిరసన తెలిపిన బుద్ధా వెంకన్న
- రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారంటూ బుద్ధా మండిపాటు
- కేసీఆర్ పై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదా? అని ప్రశ్న
- కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరిక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న ప్రేమ సొంత రాష్ట్ర ప్రజలపై లేదా? అని వెంకన్న ప్రశ్నించారు. అమరావతి రైతుల గుండెకోత మీకు వినపడటం లేదా? అని మండిపడ్డారు. అన్ని వసతులు ఉన్న అమరావతిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల అంతు చూస్తామన్న మంత్రులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తమ కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరించారు.