అమెరికా, ఇరాన్ లపై హీరో నిఖిల్ కామెంట్
- మీరిద్దరూ ఈ గ్రహం మీద నుంచి వెళ్లిపోండి
- మీ యుద్ధం ఇతరులకు అవసరం లేదు
- పర్యావరణం, ప్రశాంతతను మరింత చెడగొట్టొద్దు
మరోవైపు, ఈ దాడులపై సినీ హీరో నిఖిల్ అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యతిరేకతను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'డియర్ అమెరికా, ఇరాన్... మీరిద్దరూ యుద్ధం చేసుకోవాలనుకుంటే ఈ గ్రహం (భూమి) మీద నుంచి వెళ్లిపోయి బాంబులు విసురుకోండి. ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు మీ యుద్ధం అవసరం లేదు. ఇప్పటికే నాశనమైన పర్యావరణం, ప్రశాంతతను మీ యుద్ధాలతో మరింత చెడగొట్టకండి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.