Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజోలులో చదువుతున్నప్పుడు ఓ కుర్రాడు వెంటపడేవాడు: హీరోయిన్ అంజలి

  • నేను పుట్టింది నాన్న ఊరైన నర్సాపూర్ లో 
  • అమ్మగారి ఊరైన రాజోలులో పెరిగాను 
  • కాలేజ్ చదువు చెన్నైలో పూర్తిచేశానన్న అంజలి
అంజలి తెలుగు అమ్మాయి .. ముందుగా తమిళ సినిమాల్లో సక్సెస్ ను సాధించి, ఆ తరువాత తెలుగులో పాప్యులర్ అయింది. గలగలా మాట్లాడేసే చలాకీ పాత్రలతో యూత్ హృదయాల్లో అంజలి మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

అలాంటి అంజలి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ.. "నేను పుట్టింది మా నాన్నగారి ఊరైన నర్సాపూర్ లో .. పెరిగింది మా అమ్మగారి ఊరైన 'రాజోలు'లో అని చెప్పింది. నాకు మా నాయనమ్మగారి పేరైన బాలా త్రిపురసుందరి అంజలి' అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో వాళ్లంతా నన్ను 'బేబీ' అనే పిలిచేవారు.

ఇక జూనియర్ ఇంటర్ వరకూ నేను రాజోలులోనే చదివాను. ఆ తరువాత చెన్నైకి వెళ్లిపోయాను. రాజోలులో స్కూల్ డేస్ లో రాము అనే ఒక కుర్రాడు లవ్ చేస్తున్నానంటూ నా వెంటపడేవాడు. ఒక రోజున నేను అతనికి రాఖీ కట్టేశాను. 'రాఖీ'యే గదా ఫరవాలేదులే' అంటూ ఆ విషయాన్ని కూడా లైట్ గా తీసుకున్నాడు.. అంటూ నవ్వేసింది.
Anjali
Ali

More Telugu News