ఆపిల్ ఉద్యోగిని రోహిత కోసం ముమ్మరంగా గాలిస్తున్న హైదరాబాద్ పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆపిల్ ఉద్యోగిని రోహిత కోసం ముమ్మరంగా గాలిస్తున్న హైదరాబాద్ పోలీసులు!

  • డిసెంబర్ 26న అదృశ్యమైన రోహిత
  • సికింద్రాబాద్ లో కనిపించినట్టు వార్తలు
  • పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
గత నెల 26న ఇంట్లో నుంచి వెళ్లి అదృశ్యమైన ఆపిల్ ఉద్యోగిని రోహిత ఆచూకీ కోసం హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ఆదివారం నాడు సికింద్రాబాద్ ప్రాంతంలో కనిపించినట్టు సమాచారం రావడంతో, రెండు బృందాలు పలు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించాయి. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటున్న రోహిత, ఆపిల్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. నానక్‌ రామ్ గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ లోని మంత్రి సెలెప్టియా అపార్ట్‌ మెంట్‌ లో స్నేహితులతో కలిసి ఉంటున్న ఆమె, క్రిస్మస్ మరుసటి రోజు ఇంట్లోనుంచి బయటికి వెళ్లి, మళ్లీ తిరిగి రాలేదు.

సెల్‌ ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ రావడంతో, మూడు రోజుల పాటు గాలించిన తరువాత, రోహిత సోదరుడు పరిక్షిత్‌ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. రోహిత ఎక్కడికి వెళ్లిందన్న విషయాన్ని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. 
Rohita
Apple
Techchie
Missing

More Telugu News