ఒక్క సినిమాకు 11 అవార్డులు: పట్టలేని సంతోషంలో నటి త్రిష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక్క సినిమాకు 11 అవార్డులు: పట్టలేని సంతోషంలో నటి త్రిష

  • ‘96’ సినిమాలో నటనకుగాను త్రిషకు అవార్డుల పంట
  • గత ఏడాది రిలీజైనప్పటికీ.. వార్తల్లో నిలుస్తున్న సినిమా
  • శర్వానంద్, సమంతాలతో తెలుగులో కూడా రీమేక్ ప్రారంభం
ఒక్క పాత్రకు 11 అవార్డులను దక్కించుకున్న నటి త్రిష ఆనందాన్ని పట్టలేకపోతోంది. ఒకప్పుడు వెండితెరపై అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఇటీవల గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. దాదాపుగా కెరీర్ ముగిసిపోతుందనుకుంటున్న సమయంలో  తమిళంలో తీసిన ‘96’ సినిమాతో త్రిష తనేంటో నిరూపించుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అంతేకాక, ఇప్పటివరకు త్రిషకు 11 అవార్డులను తెచ్చిపెట్టింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఏదో ఒక విధంగా వార్తల్లో చోటుచేసుకుంటోంది.

ఈ సినిమాపై త్రిష సోషల్ మీడియా మాధ్యమంగా స్పందించింది.  జాను పాత్రకు ఇప్పటివరకు 11 అవార్డులు వచ్చాయంటూ అవార్డులతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నాకు వచ్చిన దీవెనలను లెక్కిస్తున్నా.. ‘96’కు 11 అవార్డులు, ‘హేజూడ్’(మలయాళం) సినిమాకు 3 అవార్డులు.. మీ ప్రేమకు కృతజ్ఞతలు అని త్రిష ట్వీట్ చేసింది. గత ఏడాది అక్టోబర్ 4న విడుదలైన ‘96’ చిత్రం సంచలన విజయం సాధించింది. విజయ్ సేతుపతి, త్రిష నాయకా నాయికలుగా నటించగా, సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో కూడా పునర్ నిర్మిస్తున్నారు. ఇందులో శర్వానంద్, సమంతలు నాయకా నాయికలుగా నటిస్తున్నారు.
‘96’ Movoie block buster
Actress got 11 awards
Tamil Film

More Telugu News