సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్తే ఇంత రాద్ధాంతం చేస్తారా?: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్తే ఇంత రాద్ధాంతం చేస్తారా?: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

  • చాలా కాలం తర్వాత మా ఇంట్లో పెళ్లి జరగబోతోంది
  • ఆ పనులపైనే హైదరాబాదుకు వెళ్లాను
  • 40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారు
అమరావతిపై రైతులు ఆందోళనలు కొనసాగిస్తుంటే వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ల రామకృష్ణారెడ్డి) ఎక్కడకు వెళ్లారంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆర్కే కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో, మీడియా ముందుకు ఆర్కే వచ్చారు. సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్లానని... దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారని... దీనికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని అన్నారు.

ఈనెల 17న శాసనసభలో రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని... ఆ తర్వాత కొన్ని రోజులు తాను ఇక్కడే ఉన్నానని ఆర్కే చెప్పారు. చాలా కాలం తర్వాత తమ కుటుంబంలో ఒక వివాహం జరగబోతోందని... ఆ పనులపైనే తాను హైదరాబాదుకు వెళ్లానని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని తెలిపారు.
RK
Alla Ramakrishna Reddy
YSRCP
Chandrababu

More Telugu News