అమరావతిలో రేపు వామపక్షాల పర్యటన: సీపీఐ నేత కె.రామకృష్ణ
- రాజధాని రైతులకు వామపక్షాలు అండగా ఉంటాయి
- ప్రభుత్వ నియంతృత్వ పోకడలను అడ్డుకొని తీరుతాం
- అఖిలపక్ష సమావేశం పెట్టి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోవాలి
ప్రభుత్వ నియంతృత్వ పోకడలను అడ్డుకొని తీరుతామని రామకృష్ణ ప్రకటించారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టి అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రేపు వామపక్షాల పర్యటన ఉంటుందని ప్రకటించారు. ఇది 29 గ్రామాల ప్రజల ఆందోళన కాదని, ఐదు కోట్ల మంది ప్రజల ఆవేదన అని ఆయన తెలిపారు.