మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్?

  • ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ ల సమావేశంలో నిర్ణయం
  • ఈనెల 30న ప్రమాణస్వీకారం
  • ఇప్పటికే రెండు సార్లు డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన అజిత్ పవార్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పగ్గాలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ చేపట్టబోతున్నారు. ఈనెల 30న ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా నెల క్రితం దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావడంలో అజిత్ పవార్ విఫలమయ్యారు. దీంతో, డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత తన సొంత పార్టీ ఎన్సీపీ చెంతకే చేరారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ ల మధ్య జరిగిన సమావేశంలో అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీకి కాంగ్రెస్ హాజరుకాలేదు. మరోవైపు, 2014కు ముందు కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలను నిర్వహించారు.
Ajit Pawar
NCP

More Telugu News