సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • బాలీవుడ్ సినిమాలో శ్రియ 
  • రంగంలోకి దిగుతున్న బాలయ్య
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ
  *  కొన్నాళ్ల గ్యాప్ తర్వాత కథానాయిక శ్రియ తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది. 'సబ్ ఖుషల్ మంగళ' అనే హిందీ సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన ఓ పాటలో నటించడానికి ఇటీవల ఈ ముద్దుగుమ్మ ముంబై వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రియాను వివాహమాడిన తర్వాత శ్రియ అతనితో కలసి అప్పటి నుంచీ బార్సెలోనాలో ఉంటోంది. ఈ చిత్ర నిర్మాత తనకు స్నేహితుడు కావడం వల్ల ఈ పాటలో నటించానని శ్రియ చెప్పింది.
*  'రూలర్' తర్వాత బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సంగతి విదితమే. ఇటీవలే ఈ చిత్రం షూటింగును లాంఛనంగా ప్రారంభించారు. ఇక రెగ్యులర్ షూటింగును వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ నెలాఖరు వరకు నిర్విరామంగా జరిగే షూటింగుతో దీనిని పూర్తిచేస్తారు.
*  రవితేజ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పాడు. గతంలో 'సినిమా చూపిస్త మావా', 'నేను లోకల్' చిత్రాలను రూపొందించిన త్రినాథరావు నక్కిన దీనికి దర్శకత్వం వహిస్తాడు. కామెడీ ఎంటర్ టైనర్ కథతో ఇది తెరకెక్కనుంది.  
Go Back to Shorts
Shriya
Balakrishna
Boyapati Sreenu
Raviteja

More Telugu News