ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరిస్థితిపై చిదంబరం వ్యంగ్యం
- ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
- బీజేపీకి ఎదురుగాలి
- జేఎంఎం కూటమికి ఆధిక్యం
'ఇదీ ఈ ఏడాది బీజేపీ కథ. బీజేపీయేతర పక్షాలన్నీ ఒక్కటవ్వాల్సిన తరుణం వచ్చేసింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇతర పార్టీలు కాంగ్రెస్ తో చేయి కలపాలి' అని చిదంబరం ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి బీజేపీపై ఆధిక్యత ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో 37 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి పాతిక స్థానాల కోసం చచ్చీచెడీ ఎదురీదుతోంది.