కర్నూలు జిల్లాలో అదృశ్యమైన నిహారిక మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్నూలు జిల్లాలో అదృశ్యమైన నిహారిక మృతి

  • మూడు రోజుల క్రితం అదృశ్యమైన నిహారిక
  • గుడెకల్ చెరువులో మృత దేహం లభ్యం
  • శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం అలముకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని నిహారిక శవమై తేలింది. గుడెకల్ చెరువులో ఆమె మృత దేహాన్ని గుర్తించారు. ఎల్ఎల్సీ కెనాల్ గట్టుపై ఆమె సైకిల్, బుక్స్ బ్యాగ్ లభ్యమయ్యాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు శవమై తేలడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నిహారిక ఎమ్మిగనూరులోని రవీంద్ర భారతి స్కూల్లో  పదో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి ఆమె స్కూలుకు బయల్దేరింది. అయితే ఆమె స్కూలుకు వెళ్లలేదని తెలుసుకున్న ఆమె తండ్రి... బంధువులు, స్నేహితుల ఇళ్లలో విచారించారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో... పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Niharika
Kurnool District

More Telugu News