కశ్మీర్ పై చైనా విన్నపం... ఈరోజు భేటీ అవుతున్న భద్రతామండలి
- జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించనున్న భద్రతామండలి
- ఆర్టికల్ 370 రద్దైన తర్వాత ఇది రెండో సమావేశం
- ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన చైనా, పాక్
జమ్ముకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ డిసెంబర్ 12న భద్రతామండలికి లేఖ రాశారు. దీనికి కొనసాగింపుగా చైనా కూడా లేఖ రాసింది. పాకిస్థాన్ ఆందోళనతో తాము కూడా ఏకీభవిస్తున్నామని... జమ్ముకశ్మీర్ ప్రస్తుత పరిస్థితులపై భద్రతామండలిలో చర్చ జరగాలని లేఖలో కోరింది. ఈ నేపథ్యంలో, నేడు భద్రతామండలి జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించనుంది.