బాలీవుడ్ నటి పాయల్ ను జైలుకు పంపిన కోర్టు

16-12-2019 Mon 15:13 | Entertainment
  • నెహ్రూ-గాంధీ కుటుంబంపై అభ్యంతరకర సమాచారాన్ని షేర్ చేసిన పాయల్
  • అహ్మదాబాద్ లో నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు
  • డిసెంబర్ 24 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
నెహ్రూ-గాంధీ కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర సమాచారాన్ని షేర్ చేసిన సినీ నటి పాయల్ రోహత్గిని రాజస్థాన్ లోని కోర్టు జైలుకు పంపింది. ఆమెకు డిసెంబర్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టి వేసింది. దీంతో, బెయిల్ కోసం మరోసారి ఆమె తరపు లాయర్ పిటిషన్ వేయబోతున్నారు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నివాసంలో పాయల్ ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ యాక్టుతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు అరెస్ట్ చేయడానికి కాసేపు ముందు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'మోతీలాల్ నెహ్రూపై వీడియోను రూపొందించినందుకు రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు. గూగుల్ లో ఉన్న సమాచారం ఆధారంగానే నేను ఈ వీడియో చేశా. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఒక జోక్ గా మారింది.' అని ట్వీట్ చేసింది. దీనికి తోడు ప్రధాని, కేంద్ర హోం మంత్రిలకు నమస్కారం పెడుతున్నట్టుగా  ఎమోజీని జతచేసింది.
Payal RohatgiBollywoodJudicial Custody

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more