'నేను సావర్కర్ ను' అని రాసి ఉన్న కాషాయ రంగు టోపీలను ధరించి అసెంబ్లీకి వచ్చిన మహారాష్ట్ర బీజేపీ నేతలు

  • రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిరసన
  • 'నా పేరు రాహుల్ సావర్కర్ కాదు' అని రాహుల్ వ్యాఖ్య
  • మండిపడుతోన్న బీజేపీ నేతలు
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ నేత రాహుల్  గాంధీ మాట్లాడుతూ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. 'నా పేరు రాహుల్ సావర్కర్ కాదు. నా పేరు రాహుల్ గాంధీ. ప్రాణాలైనా వదులుతాను.. కానీ, క్షమించమని అడగను' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో ఈ రోజు మహారాష్ట్ర బీజేపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇతర బీజేపీ నేతలు 'నేను సావర్కర్ ను' అని రాసి ఉన్న టోపీలను ధరించి వచ్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. కాషాయ రంగు టోపీలపై తెల్లటి అక్షరాలతో 'నేను సావర్కర్ ను' అని రాసి ఉంది.
Go Back to Shorts
Nagpur
BJP
Maharashtra

More Telugu News