కివీస్ పర్యటనకూ భువనేశ్వర్ కుమార్ డౌటే!
- ఇప్పటికే విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం
- మరింత తీవ్రమైన గాయం
- జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యులపై విమర్శలు
ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భువీ గజ్జల్లో నొప్పితోనే ఆడాడని, ఆటగాళ్ల గాయాలను గుర్తించడంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైద్యులు విఫలమవుతున్నారని ఆ వర్గాలు ఆరోపించాయి. గతంలో వృద్ధిమాన్ సాహా విషయంలోనూ ఇలానే జరిగిందని చెబుతున్నారు. ఇంకా చాలామంది ఆటగాళ్లు గాయాల బారిన పడినా భయపడి వెల్లడించడం లేదని అంటున్నారు.