ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం... ముగ్గురి దుర్మరణం

  • రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదు
  • భారీగా ఆస్తి నష్టం
  • దవావోకు 90 కిమీ దూరంలో భూకంప కేంద్రం
ఫిలిప్పీన్స్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రత నమోదైంది. ఫిలిప్పీన్స్ లోని దవావో నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ  భూకంపం ప్రభావంతో ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలో ముగ్గురు మరణించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పెద్ద శబ్దంతో భూకంపం సంభవించడంతో ప్రజలు ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) పేర్కొంది. కాగా, భూకంప బాధితుల్లో ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Philippines
Earthquake
USGS
Pacific

More Telugu News