చెన్నైలో ముగిసిన గొల్లపూడి అంత్యక్రియలు

  • కణ్ణమ్మపేటలో అంత్యక్రియలు
  • గురువారం కన్నుమూసిన గొల్లపూడి
  • కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న గొల్లపూడి
సినీ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. చెన్నైలోని కణ్ణమ్మపేట శ్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు, టీనగర్ లోని గొల్లపూడి నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న గొల్లపూడి గురువారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
Go Back to Shorts
Gollapudi
Chennai
Tollywood
Andhra Pradesh
Telangana

More Telugu News