పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠశాల బస్సు లో మంటలు.. విద్యార్థులు సురక్షితం
- పశ్చిమ గోదావరి జిల్లా మీనానగరం వద్ద ఘటన
- అకస్మాత్తుగా ఇంజన్ లోంచి పైకెగిసిన మంటలు
- డ్రైవర్ విద్యార్థులను దింపివేయడంతో తప్పిన ముప్పు
మీనా నగరం సమీపం నుంచి బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బస్సు ఇంజన్ లోంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కగా ఆపి విద్యార్థులను కిందకు దించివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు రేగాయని తెలుస్తోంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.