దర్శకుడు రాజమౌళికి షాక్.. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో జూ.ఎన్టీఆర్ నటించిన సీన్ వీడియో.. ఫొటోలు లీక్
Add ap7am to your home Screen

దర్శకుడు రాజమౌళికి షాక్.. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో జూ.ఎన్టీఆర్ నటించిన సీన్ వీడియో.. ఫొటోలు లీక్

  • కొమరం భీమ్‌ వేషధారణలో ఎన్టీఆర్ పై ఓ సీన్
  • చాటుగా మొబైల్ లో చిత్రీకరణ 
  • వైరల్ అవుతోన్న వీడియో, ఫొటోలు
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోలతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించి ఓ వీడియో లీక్ అయింది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌ వేషధారణలో ఓ సీన్ లో నటిస్తున్నట్లు కనపడుతోంది. గడ్డం, మీసాలు, దుస్తులు అన్నీ ఇందులో స్పష్టంగా కనపడ్డాయి. ఈ సినిమాలో హీరోల లుక్ లను రాజమౌళి ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఆయనకు షాక్ ఇస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లుక్ మాత్రమే కాకుండా, సీన్ కూడా వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ సినిమా 2020, జూలై 30న విడుద‌ల కానుంది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం అరకులోయలో కొనసాగుతోంది. ఎన్టీఆర్‌పై కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తోన్న సమయంలో మొబైల్ ఫోన్ లో ఎవరో తీసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని కూడా ఈ సినిమాలో  ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.
rrr
Rajamouli
ntr

More Telugu News