అందుకే రష్మిక ఆ ఆఫర్ వదులుకుందట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే రష్మిక ఆ ఆఫర్ వదులుకుందట

  • రష్మికకి యూత్ లో విపరీతమైన క్రేజ్
  • వరుసగా స్టార్ హీరోల సరసన చోటు 
  • అదంతా పుకారేనన్న రష్మిక 
యూత్ లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వున్న కథానాయికలలో రష్మిక ఒకరు. వరుసగా ఆమె స్టార్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళుతోంది. అలాంటి రష్మికకి హిందీ 'జెర్సీ' రీమేక్ లో ఛాన్స్ వచ్చిందనీ, అయితే అడిగినంత పారితోషికం ఇవ్వలేదనే కారణంగా 'నో' చెప్పేసిందనే ప్రచారం ఊపందుకుంది.

డబ్బుకి ప్రాధాన్యతనిస్తూ మంచి పాత్రను వదులుకుందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మిక స్పందిస్తూ .."హిందీ 'జెర్సీ' రీమేక్ లో నాకు అవకాశం వచ్చిన మాట నిజమే. అయితే అంతటి బరువైన పాత్రకి న్యాయం చేయలేనేమోననే ఉద్దేశంతోనే నేను అంగీకరించలేదు. అంతేగానీ ఈ సినిమాను వదులుకోవడానికి పారితోషికం కారణం కానేకాదు. మంచి పాత్రలను పారితోషికంతో నేను ఎప్పుడూ ముడిపెట్టను" అని చెప్పుకొచ్చింది.
Rashmika

More Telugu News