బంతిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుడిన శివమ్ దూబే... భారీ స్కోరు దిశగా టీమిండియా

తిరువనంతపురంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టీమిండియా యువ ఆటగాడు శివమ్ దూబే తన భుజ బలాన్ని ప్రదర్శించాడు. కేవలం 30 బంతుల్లోనే చకచకా 54 పరుగులు సాధించాడు. దూబే స్కోరు 3 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి. రన్ తీసే సమయంలో అడ్డొచ్చినందుకు తనను కొరకొరా చూసిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ ను అదే ఓవర్లో రెండు భారీ సిక్సులు బాదాడు. అదే ఊపులో వాల్ష్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 12 ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు. క్రీజులో కెప్టెన్ కోహ్లీ, రిషబ్ పంత్ ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

India
West Indies
Cricket
T20

More Telugu News