కేఆర్ విజయను ఎన్టీఆర్ కంగారుపెట్టేశారట!
Add ap7am to your home Screen

కేఆర్ విజయను ఎన్టీఆర్ కంగారుపెట్టేశారట!

  • క్రమశిక్షణకు మారు పేరు ఎన్టీఆర్ 
  • షూటింగుకి లేట్ గా వెళ్లిన కేఆర్ విజయ 
  • అప్పటి నుంచి ఆమె మారిపోయారన్న ఈశ్వర్
తెలుగు తెరపై ఒక వెలుగు కిరణంలా ఎన్టీ రామారావు కనిపిస్తారు. సాంఘికాలు .. పౌరాణికాలు .. జానపదాలు .. చారిత్రకాల ద్వారా ప్రేక్షకులపై ఆయన చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. అలాంటి ఎన్టీ రామారావును గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ పంచుకున్నారు.

"క్రమశిక్షణకి మారు పేరు ఎన్టీఆర్ అని చెప్పుకోవాలి. తనతో పాటు తన కాంబినేషన్లో చేసే ఆర్టిస్టులు కూడా సమయానికి షూటింగుకు రావాలనే విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. 'శ్రీకృష్ణపాండవీయం' సినిమాలో ఎన్టీఆర్ సరసన కేఆర్ విజయగారు నటించారు. అది ఎన్టీఆర్ గారి సొంత సినిమా. ఆ సినిమా సమయానికి ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ గురించి ఆమెకి తెలియదు. దాంతో ఆమె వరుసగా మూడు రోజుల పాటు షూటింగుకి ఆలస్యంగా వచ్చారు.

నాలుగో రోజున ఆమెకి ఒక లీగల్ నోటీస్ వచ్చింది. 'మీరు షూటింగుకి ఆలస్యంగా వస్తుండటం వలన, ఇంత మొత్తం నష్టం జరిగింది .. నష్ట పరిహారంగా మీరు అంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది' అనేది ఆ లీగల్ నోటీస్ సారాంశం. దాంతో కేఆర్ విజయగారు కంగారుపడిపోయి, ఎన్టీఆర్ గారికి 'సారీ' చెప్పేశారు. అప్పటి నుంచి ఆమె ఏ సినిమా షూటింగుకి కూడా ఆలస్యంగా వెళ్లలేదు" అని చెప్పుకొచ్చారు.
Ntr
K.R.Vijaya

More Telugu News