దిశ ఘటనపై కేసీఆర్ స్పందించట్లేదు.. మద్యపాన నిషేధంపై నిరాహార దీక్షకు దిగుతున్నాను: డీకే అరుణ
- మద్యం వల్లే రాష్ట్రంలో ఘోరాలు
- మద్యం, మాదక ద్రవ్యాలను నియంత్రించాలి
- ఈ నెల 11, 12 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద మహిళా సంకల్ప దీక్ష
రాష్ట్రంలో మద్యం, మాదక ద్రవ్యాలను నియంత్రించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధంపై రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానన్నాను. ఈ నెల 11, 12 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద మహిళా సంకల్ప దీక్ష పేరుతో నిర్వహిస్తోన్న ఈ దీక్షకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరుతున్నానని అన్నారు.