‘జనసేన’ను బీజేపీలో విలీనం చేసేందుకు పవన్ కల్యాణ్ ఏర్పాట్లు చేసుకున్నట్టు కనిపిస్తోంది: మంత్రి కొడాలి నాని
- కేంద్ర మంత్రి అమిత్ షాను పవన్ పొగుడుతున్నారు
- బీజేపీలో విలీనం చేసే సంకేతాలిచ్చారు
- మా ప్రభుత్వాన్ని గుర్తించడానికి పవన్ ఎవరు?
చంద్రబాబు ‘తానా’ అంటే పవన్ కల్యాణ్ ‘తందానా’ అంటున్నారని, తమ ప్రభుత్వాన్ని గుర్తించడానికి పవన్ ఎవరు? ఆయన్ని ప్రజలే గుర్తించలేదని, అందుకే, పోటీ చేసిన రెండు చోట్లా ఓడించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. మోసపోయామన్న బాధతోనే రైతులు దాడి చేశారని అన్నారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని చెప్పారు.