రైతు బజార్ కు వెళ్లిన పవన్ కల్యాణ్.. ఇసుక మాదిరే ఉల్లి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం!
- గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవద్దు
- ఇది సమస్యకు పరిష్కారం కాదు
- ప్రణాళికలు రచించడంలో విఫలమయ్యారు
- సమర్థత లేకపోతే తప్పుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి
గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవడం సమస్యకు పరిష్కారం కాదని పవన్ విమర్శించారు. ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత మాదిరిగానే ఉల్లి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థత లేకపోతే తప్పుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.