సింగర్ ను అవ్వాలని కోరికగా వుండేది: గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి
- బాలసుబ్రహ్మణ్యం గారు నాకు స్ఫూర్తి
- కాలేజ్ డేస్ లో పాటలు బాగా పాడేవాడిని
- గాయకుడిగా రాణించాలని ఉండేదన్న శాస్త్రి
'వయసు పిలిచింది' సినిమాలో బాలు గారి 'హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గ' పాట విన్న దగ్గర నుంచి గాయకుడిని కావాలనే ఆసక్తి మొదలైంది. కాలేజ్ డేస్ లో స్టేజ్ పై పాటలు బాగా పాడేవాడిని. చెన్నైకి వెళ్లి బాలు .. మనో మాదిరిగా గాయకుడిగా రాణించాలని అనుకునేవాడిని. కానీ నాకు చెన్నైలో కాకుండా బెంగళూర్లో జాబ్ వచ్చింది. అక్కడివాళ్లు నన్ను లిరిక్ రైటర్ గా ప్రోత్సహించారు" అని చెప్పుకొచ్చారు.