నేను ఫడ్నవీస్ తో స్నేహాన్ని కొనసాగిస్తాను.. ఇప్పటికీ హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నాను: అసెంబ్లీలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు

01-12-2019 Sun 14:22 | National
  • నేను గత ప్రభుత్వాన్ని ఎన్నడూ మోసం చేయలేదు
  • నేను ఫడ్నవీస్ ను ప్రతిపక్ష నాయకుడని పిలవను
  • ఆయనను 'బాధ్యతాయుత నాయకుడు' అని పిలుస్తాను
  • నేను ఓ 'లక్కీ సీఎం'ను
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈ రోజు ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఫడ్నవీస్ నవ్వుతూ విన్నారు. 'నేను ఫడ్నవీస్ తో ఎప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తాను. నేను ఇప్పటికీ హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నాను. దీన్ని ఎన్నటికీ వీడను' అని తెలిపారు.

'గత ఐదేళ్లలో నేను ప్రభుత్వాన్ని ఎన్నడూ మోసం చేయలేదు. నేను ఫడ్నవీస్ ను ప్రతిపక్ష నాయకుడని పిలవను. ఆయనను బాధ్యతాయుత నాయకుడు అని పిలుస్తాను. మాతో ఆయన సఖ్యతతో వ్యవహరించినట్లయితే, ఇరు పార్టీల మధ్య చీలిక వచ్చేది కాదు' అని ఉద్ధవ్ థాకరే చెప్పారు.

'నేను ఓ లక్కీ సీఎంను.. ఎందుకంటే నన్ను వ్యతిరేకించిన వారు నాతో కలిసి ఉన్నారు. గతంలో నాతో కలిసి ఉన్నవారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజల ఆశీస్సులు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను అసెంబ్లీలోకి వస్తానని ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు. అయినప్పటికీ ఇక్కడకు వచ్చాను' అని ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు.
MaharashtraUddhav ThackerayDevendra Fadvanis

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more