వెటర్నరీ వైద్యురాలి హత్య నేపథ్యంలో... చిలుకూరు బాలాజీ ఆలయం 20 నిమిషాల పాటు మూసివేత!
- 20 నిమిషాలు ఆలయం మూసివేత
- ఆపై భక్తులతో మహా ప్రదక్షిణ
- స్త్రీ జాతిని రక్షిద్దామంటూ నినాదాలు
ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడిన ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదని అన్నారు. ఈ సమాజం ఎటుపోతున్నదో అర్థం కావడంలేదని, మహిళలు సురక్షితంగా ఉండాలని వెంకటేశ్వరుని ప్రార్థించామని తెలిపారు.