అప్పట్లో ఆమీర్ ఖాన్ సినిమా నుంచి 'గీతాంజలి' గిరిజ అందుకే తప్పుకుందట

  • ఆమీర్ ఖాన్ జోడీగా గిరిజకి ఛాన్స్ వచ్చింది
  • ఆ సీన్లో చేయనని గిరిజ చెప్పిందట 
  • కోర్టు తీర్పు ఆమెకి అనుకూలంగా వచ్చిందన్న ఈశ్వర్ 
'గీతాంజలి' తరువాత గిరిజ చేసిన 'హృదయాంజలి' సినిమాకి రచయితగా బీకే ఈశ్వర్ పనిచేశారు. తాజాగా ఆయన గిరిజ గురించి ప్రస్తావిస్తూ .. అప్పట్లో 'జో జీతా వహి సికిందర్' అనే సినిమాలో ఆమీర్ ఖాన్ సరసన చేసే అవకాశం గిరిజకి వచ్చింది. అయితే ఆ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. అందుకు కారణం ఏమిటని ఒక సందర్భంలో నేను అడిగినప్పుడు ఆమె చెప్పింది.

ఆ సినిమాలో ఒక అభ్యంతరకర సన్నివేశంలో నటించమని దర్శకుడు అడిగాడట. నేను చేయనని గిరిజగారు చెప్పడంతో, ముందుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినిపించుకోకపోవడంతో భయపెట్టారట. చివరికి విషయం కోర్టువరకూ వెళ్లింది. కోర్టు తీర్పు గిరిజ గారికి అనుకూలంగా వచ్చింది. ఫలితంగా ఆ సినిమా నిర్మాతలు గిరిజకి భారీ మొత్తాన్నే చెల్లించవలసి వచ్చిందట. ఆ తరువాత గిరిజ స్థానంలో ఆయేషా జుల్కా నటించింది" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Girija
Aamir Khan

More Telugu News