పంక్చర్ వేయిస్తామన్న వ్యక్తులపైనే అనుమానం... డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసులో పోలీసుల దర్యాప్తు

  • హైదరాబాద్ శివార్లలో హత్యకు గురైన మహిళా వైద్యురాలు  
  • అత్యాచారం జరిపి హత్యచేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు
  • 10 పోలీసు బృందాలతో గాలింపు
హైదరాబాద్ నగర శివార్లలో డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆపై దహనం చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వివరాలు తెలిపారు. నిందితుల కోసం పది పోలీసు బృందాలు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయని అన్నారు. ప్రియాంక రెడ్డి స్కూటీకి పంక్చర్ అయిన విషయం గుర్తించి తన సోదరికి ఫోన్ చేసి చెప్పిందని, ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు పంక్చర్ వేయిస్తామంటున్న విషయాన్ని కూడా సోదరికి వివరించిందని వెల్లడించారు. ఆ ఇద్దరు వ్యక్తులే ప్రియాంకపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చి ఉంటారని అనుమానం కలుగుతోందని తెలిపారు. ఘటన స్థలానికి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తే మరింత సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Go Back to Shorts
Disha
Hyderabad
Doctor
Murder
Police

More Telugu News