నిఖిల్ హీరోగా 'హనుమాన్' ఫాంటసీ మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ హీరోగా 'హనుమాన్' ఫాంటసీ మూవీ

  • రేపు థియేటర్లకు రానున్న 'అర్జున్ సురవరం'
  • 'కార్తికేయ 2'కి సన్నాహాలు 
  • హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా
నిఖిల్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అర్జున్ సురవరం' సిద్ధమవుతోంది. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. వచ్చే ఏడాది నిఖిల్ నుంచి మూడు సినిమాలు రానున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో ఆయన 'కార్తికేయ 2' సినిమా చేయనున్నాడు. 'కార్తికేయ' సినిమాకి ఇది సీక్వెల్ కావడంతో అంతా ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తితో వున్నారు.

ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. గతంలో వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా చేసిన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక 'హనుమాన్' అనే ఒక ఫాంటసీ మూవీని కూడా ఆయన చేయనున్నాడు. ఇంతకుముందు నిఖిల్ తో 'శ్వాస' సినిమాను నిర్మించాలనుకున్నవారే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. దర్శకుడు ఎవరనే విషయంతోపాటు మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Nikhil

More Telugu News