అజిత్ పవార్ కు పదవిపై నిర్ణయం ఎన్సీపీ అధినేతదే!: సంజయ్ రౌత్
- నాకు తెలియదు.. ఇది ఎన్సీపీకి సంబంధించిన విషయం
- మా కూటమిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సీనియర్ నాయకుడు
- ఎన్సీపీ నేతలకు ఏ పదవి ఇవ్వాలన్న విషయంపై ఆయనదే నిర్ణయం
అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ రౌత్ సమాధానం చెబుతూ... 'నాకు తెలియదు.. ఇది ఎన్సీపీకి సంబంధించిన విషయం. మహా వికాస్ అఘాడిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సీనియర్ నాయకుడు. అజిత్ పవార్ కు గానీ, ఇతర ఎన్సీపీ నేతలకు గానీ ఏ పదవి ఇవ్వాలన్న విషయంపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు' అని వ్యాఖ్యానించారు. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.