గడ్చిరోలి ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

  • లొంగిపోయిన వారిలో కసన్‌సూర్ దళ కమాండర్ సందీప్
  • మావోయిస్టులపై కిడ్నాప్, ఎన్‌కౌంటర్, హత్య కేసులు
  • రూ.31.50 లక్షల రివార్డు
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో కసన్‌సూర్ దళ కమాండర్ సందీప్ అలియాస్ మహారు చమ్రూ సహా వివిధ దళాలకు చెందిన మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై కిడ్నాప్, ఎన్‌కౌంటర్, హత్య కేసులు ఉన్నాయి. అలాగే, రూ. 31.50 లక్షల రివార్డు కూడా ఉంది. లొంగిపోయిన మావోలపై ఎటువంటి చర్యలు తీసుకునేది త్వరలో వెల్లడిస్తామని డీఐజీ మహాదేవ్ తంబడే, ఎస్పీ శైలేష్ బాలాక్వాడ్‌లు తెలిపారు.
Go Back to Shorts
maoists
Maharashtra
Police

More Telugu News