సంక్రాంతి బరిలోకి 'ఎంత మంచివాడవురా'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంక్రాంతి బరిలోకి 'ఎంత మంచివాడవురా'

  • గ్రామీణ నేపథ్యంలో 'ఎంత మంచివాడవురా'
  • వేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు 
  • జనవరి 15వ తేదీన విడుదల 
కుటుంబ నేపథ్యంలో సాగే కథాంశాలను ఎంచుకుని తెరపై ఆహ్లాదంగా ఆవిష్కరించడంలో దర్శకుడిగా సతీశ్ వేగేశ్న తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఎంత మంచివాడవురా' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కల్యాణ్ రామ్ - మెహ్రీన్ జంటగా నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందనే టాక్ కొన్ని రోజుల క్రితం వినిపించింది.

అయితే ఇటీవల అందుకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో, జనవరిలో రాదేమోనని అనుకున్నారు. కానీ ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకుందనీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనే సమాచారాన్ని ఇస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేదీన విడుదల చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు.
Kalyan Ram
Mehreen

More Telugu News