మీ జగన్ వసూలు చేసిన రూ. 1600 కోట్ల గురించి చెప్పండి విజయసాయిరెడ్డిగారూ: బుద్ధా వెంకన్న
- ఇసుక ద్వారా రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారు
- వైసీపీ నేతలు మెక్కేసిన రూ. 630 కోట్ల గురించి చెప్పండి
- భవన నిర్మాణ కార్మికులు చనిపోతే.. మీకు కొంత కూడా బాధ లేదు
ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. విజయసాయిరెడ్డిగారు... డబ్బుపై మీకు, మీ జగన్ కు ఉన్న పిచ్చిని మరోసారి బయటపెట్టారని అన్నారు. ఇసుక ద్వారా రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్న మీకు.... మీ జగన్ చెత్త నిర్ణయాల వల్ల 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే... వారి గురించి కొంత బాధ కూడా లేదని విమర్శించారు.