సికింద్రాబాద్ లో ఆగివున్న కారులో భారీగా బంగారం పట్టివేత

  • కారులో 40 బంగారు బిస్కెట్లు
  • మార్కెట్లో వాటి విలువ రూ.1.95 కోట్లు
  • మరో రూ.2 కోట్ల నగదు స్వాధీనం
విదేశాల నుంచి బంగారం అక్రమరవాణాకు జంటనగరాలు కేంద్ర స్థానంగా మారాయని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా, సికింద్రాబాద్ లోని ఈస్ట్ మారేడ్ పల్లి వద్ద ఓ ఆసుపత్రి సమీపంలో నిలిపి ఉంచిన కారులో భారీగా బంగారం గుర్తించారు. కారులో 4 కిలోల బరువున్న 40 బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. వాటి విలువ మార్కెట్ రేట్ల ప్రకారం సుమారు రూ.1.95 కోట్లు ఉంటుందని అంచనా.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మరో రెండు కోట్ల రూపాయల నగదు కూడా బయటపడింది. విదేశాల నుంచి కోల్ కతాకు బంగారం తీసుకువచ్చి అక్కడి నుంచి కర్ణాటక మీదుగా హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్నట్టు నిందితులు వెల్లడించారు.
Go Back to Shorts
Hyderabad
Secunderabad
Gold

More Telugu News