మహారాష్ట్రపై కీలక చర్చలు... సోనియా ఇంటికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న నేతలు!
మహారాష్ట్ర వ్యవహారాలపై న్యూఢిల్లీలోని కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కీలక చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభంకాగా, పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్, అంబికా సోనీ, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ తదితర నేతలంతా ఇప్పటికే సోనియా నివాసానికి చేరుకోగా, మరికొందరు నేతలు సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ - శివసేన కూటమికి మద్దతు పలికే అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకే ఈ సమావేశం జరుగుతోంది. కాగా, ఈ సమావేశానికి రాహుల్ గాంధీ మాత్రం దూరంగా ఉండటం గమనార్హం.