'ఆర్ఆర్ఆర్' కీలక పాత్రల్లోని హాలీవుడ్ స్టార్స్ వీరే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ఆర్ఆర్' కీలక పాత్రల్లోని హాలీవుడ్ స్టార్స్ వీరే!

  • ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్ 
  •  జెన్నిఫర్ పాత్రలో ఒలివియా మోరిస్ 
  •  కీలక పాత్రల్లో ఆలిసన్ డూడి - రే స్టీవెన్సన్
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందుతోంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కథా నేపథ్యం పరంగా ఈ సినిమాకి హాలీవుడ్ నటీనటులు అవసరం. అందువలన ముఖ్యమైన కొన్ని పాత్రల కోసం హాలీవుడ్ నటీనటులను ఎంపిక చేసుకున్నారు. కొంతసేపటి క్రితం వాళ్ల పేర్లను ప్రకటించారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన 'స్కాట్' పాత్ర కోసం ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ ను తీసుకున్నారు. లేడీ విలన్ పాత్ర కోసం సీనియర్ యాక్ట్రెస్ ఆలిసన్ డూడిని ఎంపిక చేసుకున్నారు. 'ఇండియానా జోన్స్' .. 'టాఫిన్'.. 'మేజర్ లీగ్ 2' వంటి సినిమాలతో ఆమె మరింత పాప్యులర్ అయ్యారు. త్వరలోనే ఈ ఇద్దరూ కూడా షూటింగులో జాయిన్ కానున్నారు. వచ్చే ఏడాదిలో జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Ray Stevenson
Alison Doody

More Telugu News