చిదంబరం బెయిల్ పిటిషన్ పై విచారణ... ఈడీకీ సుప్రీంకోర్టు నోటీసులు
- ఇటీవల ఢిల్లీ హైకోర్టులో చిదంబరానికి చుక్కెదురు
- బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
- పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు
పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసి, విచారిస్తోంది. ఆయన సుమారు 90 రోజులుగా జైలులోనే ఉంటున్నారు. ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్టు ఇటీవల ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.