మా ఇద్దరిదీ 40 ఏళ్ల అనుబంధం... ఇద్దరం కలిస్తే అనుకున్నది సాధించగలం: కమలహాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా ఇద్దరిదీ 40 ఏళ్ల అనుబంధం... ఇద్దరం కలిస్తే అనుకున్నది సాధించగలం: కమలహాసన్

  • తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు!
  • కలిసిరావాలంటూ రజనీకాంత్ కు కమల్ పిలుపు
  • సానుకూలంగా స్పందించిన రజనీ
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్, కమలహాసన్ విడివిడిగా మాట్లాడిన మాటలు తమిళ రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కమలహాసన్ మాట్లాడుతూ, రజనీకాంత్ తమతో కలిసివస్తే తమిళనాడు ప్రజలకు అద్భుతమైన రీతిలో సంక్షేమం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. తామిద్దరిది 40 ఏళ్ల అనుబంధమని, తామిద్దరం కలిస్తే తాము ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చామో అది తప్పక సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై మీడియా రజనీని అడగ్గా, తాను కమల్ తో కలిసేందుకు సిద్ధమేనని అన్నారు. దీనిపై కమల్ కూడా హర్షం వ్యక్తం చేశారు.
Kamal Haasan
Rajinikanth
Tamilnadu

More Telugu News