'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' నుంచి ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసిన వర్మ.. రేపు ట్రైలర్-2 విడుదల
- రేపు ఉదయం 9.36 గంటలకు ఈ సినిమాకు ట్రైలర్-2 విడుదల
- ఇప్పటికే పలు వివాదాస్పద పోస్టర్లు విడుదల చేసిన వర్మ
- ఏపీ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి సినిమా
సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన రామ్ గోపాల్ వర్మ... ఈ చిత్రంలోంచి పోస్టర్లను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే చంద్రబాబు, నారా లోకేశ్ తో దేవాన్ష్ ఆడుకుంటున్నట్లు ఉన్న పోస్టర్ ను బాలల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మొదటి ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.