షర్ట్ విప్పి మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని... ప్రేమగా భుజంపై చెయ్యేసి మాట్లాడిన కోహ్లీ!
- ఇండోర్ లో బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్
- అభిమానిని ఏమీ అనవద్దని చెప్పిన కోహ్లీ
- కోహ్లీ స్పందనకు నెటిజన్ల ఫిదా
కాగా, మైదానంలోకి దూసుకు వచ్చిన యువకుడి పేరు సూరజ్ అని, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవాడని, కోహ్లీకి వీరాభిమాని అని అన్నాడు. కోహ్లీ పేరును తన చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడని, శరీరంపై 'వీకే' అని రంగుల పచ్చబొట్టు పొడిపించుకున్నాడని వెల్లడించారు. బంగ్లాదేశ్ తో ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ని మూడో రోజే ముగించిన భారత్, ఇన్నింగ్స్, 130 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి కోల్ కతా వేదికగా, రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ, అభిమానులే తమకు స్ఫూర్తని, వారి ప్రోత్సాహంతోనే మ్యాచ్ లను గెలుస్తుంటామని వ్యాఖ్యానించాడు.