న్యూమోనియాతో బాధపడుతున్న సినీ నటుడు కృష్ణంరాజు.. కేర్ ఆసుపత్రిలో చేరిక

  • నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరిక
  • ఐసీయూలో ఉంచి చికిత్స
  • నిలకడగా ఆరోగ్యం
తెలుగు చిత్రసీమకు చెందిన సీనియర్ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు (79) ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్య నిపుణులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Go Back to Shorts
Tollywood
krishnam raju
care hospital

More Telugu News