Botsa Satyanarayana: పవన్ గురించి సీఎం జగన్ ఉన్నమాటే అన్నారు: మంత్రి బొత్స

  • పవన్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని జగన్ ప్రశ్నించారు  
  • ప్రభుత్వం ఏ పనిచేసినా విమర్శలు చేయడమే పవన్ పనిగా పెట్టుకున్నారు
  • చిన్నప్పటినుంచే ఇంగ్లీష్ మీడియం అలవాటు చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది 
పవన్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. సీఎం ఉన్న మాటే చెప్పారని, చిన్నప్పటినుంచి ఇంగ్లీష్ మీడియం అలవాటు చేస్తేనే పిల్లలు అభివృద్ధి పథంలో ఉంటారని అన్నారు.

 ప్రభుత్వం ఏం చేసినా విమర్శలు చేయడమే పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నారని బొత్స విమర్శించారు. మధ్యలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తే విద్యార్థులు అయోమయానికి గురవుతారన్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్యలు, పిల్లలపై సీఎం జగన్ అనుచితంగా వ్యాఖ్యలు చేశారని విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ, జగన్ ఏమీ విమర్శించలేదని, ఉన్నమాటే అన్నారని బొత్స సమర్థించారు.
Botsa Satyanarayana
Andhra Pradesh
Comments on Pawan Kalyan

More Telugu News