యాక్సిడెంట్ తరువాత నా కెరియర్ మళ్లీ మొదటికొచ్చింది: 'రోజాపూలు' హీరో శ్రీరామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్సిడెంట్ తరువాత నా కెరియర్ మళ్లీ మొదటికొచ్చింది: 'రోజాపూలు' హీరో శ్రీరామ్

  • 'రోజాపూలు' మంచి పేరు తెచ్చింది 
  • 'ఒకరికి ఒకరు' మ్యూజికల్ హిట్ 
  • అప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చిందన్న శ్రీరామ్
'రోజాపూలు' అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీరామ్, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించాడు. 'రోజాపూలు' సినిమా అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను బాగా ఆడింది. ఆ తరువాత తమిళంలో హీరోగా నేను బిజీ అయ్యాను. ఆ సమయంలోనే తెలుగులో 'ఒకరికి ఒకరు' సినిమా చేశాను. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఆ చిత్రం, తెలుగు ప్రేక్షకులకు నన్ను మరింత చేరువ చేసింది.

అలా తమిళంతో పాటు తెలుగులోను నేను బిజీ అవుతానని అనుకుంటూ ఉండగానే నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. రెండు సంవత్సరాల పాటు నేను సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ ప్రమాదం తరువాత కెరియర్ మళ్లీ మొదటికొచ్చింది. అంతకుముందు నాతో సినిమాలు చేస్తామంటూ తిరిగిన వాళ్లెవరూ నన్ను పట్టించుకోలేదు. దాంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వెళ్లాను. ఇప్పుడు మాత్రం హీరో అవకాశాలకు .. కీలకమైన పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Sri Ram

More Telugu News